Konda Surekha Sorry to Nagarjuna Sensational : స్పందించిన కొండా సురేఖా సారీ నాగార్జునా

సుదీర్ఘ వివాదానికి తర దించిన మంత్రి

Hello Telugu - Konda Surekha Sorry to Nagarjuna Sensational

Hello Telugu - Konda Surekha Sorry to Nagarjuna Sensational

Konda Surekha : హైద‌రాబాద్ : ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆ మ‌ధ్య‌న‌. సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌లపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కొంద‌రు పెద్ద‌లు ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేయ‌డంపై మ‌న‌స్థాపానికి గుర‌య్యారు అక్కినేని నాగార్జున‌, ఫ్యామిలీ. ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. సురేఖ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. న‌ష్ట ప‌రిహారం కూడా చెల్లించాల‌ని పేర్కొన్నారు.

Minister Konda Surekha Sorry to Nagarjuna

సురేఖ‌, నాగార్జున ఎపిసోడ్ తీవ్ర వివాదాల‌కు, ఆరోప‌ణ‌ల‌కు దారి తీసేలా చేసింది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల యుద్దానికి తెర తీశారు. ఈ తరుణంలో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మార‌డంతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. ఇరువురి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చిన‌ట్లు టాక్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన సూచ‌న‌ల‌తో దిగి వ‌చ్చారు కొండా సురేఖ‌. బుధ‌వారం అక్కినేని నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ నాగ్ ను, ఆయ‌న కుటుంబీకుల‌ను మ‌నో వేద‌న‌కు గురి చేస్తాయ‌ని తాను భావించ లేద‌ని పేర్కొన్నారు కొండా సురేఖ‌. ఎక్స్ వేదిక‌గా ఆమె కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలిపారు.

Also Read : Koil Alwar Tiruchanoor Interesting : శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Exit mobile version