MLA Komatireddy Raj Gopal Warning : మునుగోడుకు అన్యాయం జ‌రిగితే ఊరుకోను

ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వార్నింగ్

Hello Telugu - MLA Komatireddy Raj Gopal Warning

Hello Telugu - MLA Komatireddy Raj Gopal Warning

Komatireddy Raj Gopal : న‌ల్ల‌గొండ జిల్లా – కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి రెచ్చి పోయారు. స్వంత అధికార పార్టీపై, ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి (Komatireddy Raj Gopal) అన్యాయం జరిగినట్టేన‌ని చెప్పారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ, మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాన‌ని అన్నారు.

Komatireddy Raj Gopal Reddy Warning

మీరు మాటిచ్చారు ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని డిమాండ్ చేశారు రాజ గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal) . త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్న మాట ఆల‌స్య‌మైంద‌ని, స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌డం లేదంటూ కుంటి సాకులు చెబుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఎందుకు కుదరటం లేదు సమీకర‌ణాలు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా ఎవ‌రు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిల‌దీశారు .

త‌న‌ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని అని అన్నారు ఎమ్మెల్యే. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం అని భ‌గ్గుమ‌న్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందంటూ మండిప‌డ్డారు తీవ్ర స్థాయిలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నార‌ని, మ‌రి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని నిల‌దీశారు.

ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ప్ర‌శ్నించారు. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను . నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను . నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందని వాపోయారు. ప్రభుత్వ దవాఖనాకు పోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయని వాపోయారు.

Also Read : Telangana BJP Chief Shocking : బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు హౌస్ అరెస్ట్

Exit mobile version