Sanju Samson New Innovation : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడ‌నున్న శాంస‌న్

ఐపీఎల్ 2026 వేలం పాట‌కు రానున్న క్రికెట‌ర్

Hello Telugu - Sanju Samson New Innovation

Hello Telugu - Sanju Samson New Innovation

Sanju Samson : కేర‌ళ సూప‌ర్ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson) మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. త‌ను ఇప్పుడు ఆసియా క‌ప్ లో ఆడేందుకు దుబాయ్ కి చేరుకున్నాడు. అంత‌కు ముందు కేర‌ళ క్రికెట్ లీగ్ లో పాలు పంచుకున్నాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అద్భుతంగా ఆడాడు. సెంచ‌రీ, ఆఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగాడు. ఏకంగా 36 సిక్స‌ర్లు బాదాడు. ఈస‌మ‌యంలో త‌నను తుది జ‌ట్టులో ఎంపిక చేస్తారా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఓ వైపు జితేశ్ శ‌ర్మ‌తో పాటు ఎవ‌రు ఓపెనింగ్ చేస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ త‌రుణంలో ఈ ఏడాది 2025లో జ‌రిగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో త‌ను ప్రాతినిధ్యం వ‌హించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆశించిన మేర రాణించ లేదు. ఇదే క్ర‌మంలో ఉన్న‌ట్టుండి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ ఉన్న‌ట్టుండి తాను వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Sanju Samson Quit From RR

అనారోగ్యం కార‌ణంగా కొన్ని మ్యాచ్ లు ఆడ‌లేదు. ఇదే స‌మ‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్మెంట్ కు సంజూ శాంస‌న్ కు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీంతో తాను వీడేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు తేలి పోయింది దీంతో ఏ జ‌ట్టు త‌న‌ను తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతుంద‌నేది ఉత్కంఠ నెల‌కొంది. ఓ వైపు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కొత్త‌గా చైర్మ‌న్ గా కొలువు తీరాడు ఎన్. శ్రీ‌నివాస‌న్. ఆ జ‌ట్టు యాజ‌మాన్యం కూడా ఈసారి వేలంపాట‌లో శాంస‌న్ ను చేజిక్కించు కునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇదే స‌మ‌యంలో ఎక్కువ‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ సంజూను తీసుకోవాల‌ని అనుకుంటోంద‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా శాంస‌న్ ఈసారి ఐపీఎల్ లో ఏం జ‌రుగుతుంద‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది.

Also Read : Japam PM Shigeru Resignation Shocking : జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇషిబా రాజీనామా

Exit mobile version