KK Survey : హైదరాబాద్ : అందరి దృష్టి ప్రస్తుతం జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై అంచనాలు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల (BRS) మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఈ తరుణంలో సర్వే సంస్థలు ఎవరికి తోచిన రీతిలో వారే ముందస్తుగా ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో సర్వే చేయడంలో పేరు పొందిన సంస్థ కేకే (KK Survey) కీలక వివరాలు వెల్లడించింది. ముందస్తుగా ఏ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వస్తాయనే దానిపై అంచనా వేసింది. మరోసారి జూబ్లీహిల్స్ లో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపీనాథ్ విజయం సాధించ బోతోందని ప్రకటించింది. ఒక రకంగా గులాబీ పార్టీకి ఇది బూస్ట్ ఇచ్చే అంశమని చెప్పక తప్పదు. ఈ సర్వే ఫలితాలలో అధికార పార్టీ కాంగ్రెస్ వెనుకంజలో , రెండవ స్థానంలో ఉండడం విస్తు పోయేలా చేసింది.
KK Survey Survey Updates for Jubilee Hills By Election
ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇక సర్వే ఫలితాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 55.2 శాతం, కాంగ్రెస్ పార్టీకి 37.8 శాతం, బీజేపీకి 7 శాతం ఓట్లు రానున్నాయని అంచనా వేసింది. ఆయా డివిజన్ల వారీగా చూస్తే బోరబండలో బీఆర్ఎస్ కు 63.2 శాతం, కాంగ్రెస్ కు 31.6 శాతం, బీజేపీకి 5.2 శాతం, రహమత్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ కు 45.6 శాతం, కాంగ్రెస్ కు 51.1 శాతం, బీజేపీకి 3.3 శాతం, శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ కు 61.9 శాతం, కాంగ్రెస్ కు 33.3 శాతం, బీజేపీకి 4.8 శాతం, వెంగళరావు నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ కు 46.1 శాతం, కాంగ్రెస్ కు 48.5 శాతం, బీజేపీకి 5.5 శాతం ఓట్లు రానున్నాయని కేకే సర్వే పేర్కొంది.
ఇక ఎర్రగడ్డ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి 61.6 శాతం, కాంగ్రెస్ పార్టీకి 31.7 శాతం, బీజేపీకి 6.7 శాతం, షేక్ పేట డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి 60.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 33.6 శాతం రాగా భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క శాతం ఓటు రాక పోవడం విశేషం. యూసుఫ్ గూడ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి 47 శాతం, కాంగ్రెస్ పార్టీకి 45.5 శాతం, బీజేపీకి 7.4 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది కేకే సర్వే.
Also Read : K Kavitha Strong Demand : కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత
