Kishan Reddy Shocking Comments on KCR : కేసీఆర్ సీఎం అయ్యే అవ‌కాశం లేదు

కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి

Hello Telugu - Kishan Reddy Shocking Comments on KCR

Hello Telugu - Kishan Reddy Shocking Comments on KCR

Kishan Reddy : హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి (Kishan Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కిష‌న్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతార‌ని, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ క‌ల‌లు కంటున్నార‌ని, కానీ అంత సీన్ లేద‌న్నారు. ప్ర‌జ‌లు ఆ పార్టీని పూర్తిగా తిర‌స్క‌రించార‌ని ఆ విష‌యం ఎన్నిక‌ల్లో తేలి పోయింద‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎదిగింద‌ని చెప్పారు. సోమ‌వారం ఆయ‌న ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. క‌ల‌లు క‌న‌డంలో త‌ప్పు లేద‌ని, ఇక ఆ క‌ల‌లు ఎంత వ‌ర‌కు వాస్త‌వం దాల్చుతాయో ప్ర‌జ‌ల చేతుల్లో ఉంటుంద‌న్నారు.

Union Minister Kishan Reddy Shocking Comments on KCR

ఆ విష‌యం తెలుసుకోకుండా కేటీఆర్, ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం ఎక్కువ‌గా ఊహించు కుంటోందంటూ ఎద్దేవా చేశారు. సీఎంగా ప‌దేళ్లు పాలించిన కేసీఆర్ ఇంక ఏం ముఖం పెట్టుకుని మ‌రోసారి సీఎం కావాల‌ని అనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్య‌త బీఆర్ఎస్ నేత‌ల‌పై ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్ర‌త్యామ్నాయం కాద‌న్నారు. బీజేపీనే అస‌లైన ప్ర‌తిప‌క్ష పార్టీ అని స్ప‌ష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి లంకాల దిలీప్ రెడ్డి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు జి. కిష‌న్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా తాజాగా బీఆర్ఎస్ ను ఉద్దేశించి, మాజీ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గురించి చేసిన కామెంట్స్ పై ఇంకా కేటీఆర్ స్పందించ లేదు.

Also Read : Minister Ponnam Prabhakar Clear Instructions : బ‌స్సు ప్ర‌మాదంపై విచార‌ణ‌కు ఆదేశం

Exit mobile version