Kiran Endicott – Marriott Interesting : మారియ‌ట్ ఇంట‌ర్నేషన‌ల్ వీసీగా కిర‌ణ్ ఆండికాట్

ద‌క్షిణాసియా విభాగానికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గింత

Hello Telugu - Kiran Endicott - Marriott Interesting

Hello Telugu - Kiran Endicott - Marriott Interesting

Kiran Endicott : అమెరికా : మారియట్ ఇంటర్నేషనల్ దక్షిణాసియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కిరణ్ ఆండికాట్‌ను నియమించింది . ఆయ‌నకు హోట‌ల్స్ నిర్వ‌హ‌ణ‌లో అపార‌మైన అనుభ‌వం క‌లిగి ఉన్నారు. దక్షిణాసియా ప్రాంతాన్ని తదుపరి దశ వృద్ధిలో నడిపించడానికి విస్తృతమైన బహుళ-విభాగ అనుభవం కలిగిన హాస్పిటాలిటీ లీడర్ గా గుర్తింపు పొందిన‌ కిరణ్ ఆండికాట్ కు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు సంస్థ పేర్కొంది. మారియట్ ఇంటర్నేషనల్ ఇంక్ శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అధికారికంగా వెల్ల‌డించింది. దక్షిణాసియా ప్రాంతానికి నాయకత్వం వహించడానికి కిరణ్ ఆండికాట్ (Kiran Endicott) సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ను నియమించినందుకు ఆనందంగా ఉంద‌ని సంస్థ తెలిపింది.

Marriott International Announced Kiran Endicott Name As a VP

ఈ ప్రమోషన్‌లో కిరణ్ మారియట్ ఇంటర్నేషనల్ దక్షిణాసియా పోర్ట్‌ఫోలియో అంతటా కార్యకలాపాలు , అభివృద్ధిని పర్యవేక్షిస్తారని పేర్కొంది. ఈ విస్తరించిన పాత్రలో,అతను ఆపరేటింగ్ పనితీరుతో మ‌రింత తోడ్పాటు అందించేందుకు కీల‌క పాత్ర పోషిస్తార‌ని స్ప‌ష్టం చేసింది. భాగస్వామ్యాలను మరింతగా పెంచుతాడని న‌మ్మ‌కం వ్య‌క్తం చేసింది. కిర‌ణ్ ఆండిక‌ట్ బ‌ల‌మైన నాయ‌క‌త్వానికి న‌మూనాగా ఉన్నార‌ని ప్ర‌శంసించింది. భారతదేశం, దక్షిణాసియాలోని వివిధ ఆతిథ్య విభాగాలలో జట్లకు నాయకత్వం వహించడంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది త‌న‌కు అని తెలిపింది మారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ హొట‌ల్.

కన్సల్టెన్సీ, ప్రణాళిక, సాధ్యాసాధ్యాల నుండి అభివృద్ధి వరకు కిరణ్ 2006లో మారియట్ డెవలప్‌మెంట్ , ఫీజిబిలిటీ బృందంలో చేరారు, తన 19 సంవత్సరాల పదవీకాలంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. అతని విస్తృత శ్రేణి నైపుణ్యం, లోతైన మార్కెట్ పరిజ్ఞానం మారియట్ ఇంటర్నేషనల్‌ను దక్షిణాసియాలో కంపెనీని మ‌రింత టాప్ లోకి తీసుకు వెళ్లేందుకు దోహ‌ద ప‌డ‌తార‌ని విశ్వాసం వ్య‌క్తం చేసింది సంస్థ‌.

Also Read : GST 2.0 – Telangana Suffer : జీఎస్టీ 2.0లో తెలంగాణ‌కు భారీ న‌ష్టం

Exit mobile version