టాక్సిక్ మూవీలో కియారా అద్వానీకి భారీ రెమ్యూన‌రేష‌న్

సినీ న‌టుల్లో య‌శ్ కు రూ. 50 కోట్లు.. కియారాకు రూ. 15 కోట్లు

hellotelugu-Toxicremunaretion

బెంగ‌ళూరు : గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ కీల‌క పాత్ర పోషించిన టాక్సిక్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇక సినిమాకు సంబంధించి ఆయా తారలు ఎంతెంత రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నార‌నే దానిపై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టాక్సిక్ లో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ కీ రోల్ పోషించిన పాన్ ఇండియా స్టార్ య‌ష్ కు ద‌క్కింది. త‌ను రూ. 50 కోట్లు తీసుకోగా త‌న‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ లో ర‌క్తి క‌ట్టించిన న‌టి కియారా అద్వానీ రూ. 15 కోట్లు ముట్టిన‌ట్లు టాక్.

విచిత్రం ఏమిటంటే టాక్సిక్ లో నయనతార కంటే కియారా అద్వానీకే ఎక్కువ రెమ్యూనరేషన్ ద‌క్కింది. ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా , రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ తారలు నటించారు. ముఖ్యంగా నటీనటుల పారితోషికాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రానికి కథానాయకుడు యష్ స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు; ఈ చిత్రంలో కియారా అద్వానీ ‘నాడియా’ పాత్రను పోషించారు. ఈ పాత్ర కోసం ఆమె రూ. 15 కోట్లు అందుకున్నారు, తద్వారా ఈ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఆమె నిలిచారు. సీనియర్ నటి నయనతార కంటే ఆమెకే ఎక్కువ పారితోషికం దక్కింది. నయనతార ఇందులో ‘గంగ’ పాత్రలో నటించారు. ఆమె పారితోషికం ఎంత అనేది అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఆమె రూ. 12 కోట్ల నుండి రూ. 18 కోట్ల మధ్య తీసుకున్నట్లు సమాచారం. ఇక రుక్మిణి వసంత్ రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల మధ్య పారితోషికం పొందారు. మరోవైపు, తారా సుతారియా , హుమా ఖురేషీ తమ పాత్రల కోసం రూ. 2 కోట్ల నుండి రూ. 3 కోట్ల పరిధిలో పారితోషికం తీసుకున్నారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Exit mobile version