యశ్ ‘టాక్సిక్’ మూవీపై మిశ్ర‌మ స్పంద‌న

ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన గీతూ మూవీ

hellotelugu-ToxicMoviereview

హైద‌రాబాద్ : నాలుగేళ్ల పాటు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాక్సిక్ భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అసభ్యత, హింస ప్ర‌ధానంగా ఉండ‌డంతో కొంత ఇబ్బంది ఏర్ప‌డింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. దీనిని పూర్తిగా యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపుదిద్దారు ద‌ర్శ‌కురాలు. ఇందులో పాన్ ఇండియా స్టార్ యష్, కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి తదితరులు న‌టించారు. అయితే, ఒక గంభీరమైన వ్యక్తిత్వం, స్టైలిష్ ప్రెజెంటేషన్ , కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు మాత్రమే ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మూడు గంట‌ల‌కు పైగా ఉండ‌డం కూడా సినిమాకు ప్ల‌స్ కాక పోగా మైన‌స్ గా మారింది. సరైన కథాంశం, బలమైన కథనం , ప్రేక్షకులు మమేకమయ్యే పాత్రలు లేక పోవ‌డం మిశ్ర‌మ స్పంద‌న‌కు ఆస్కారం ఇచ్చేలా చేసింది.

1947 నాటి గోవా నేపథ్యంలో సాగే ఈ చిత్రం అండర్ వరల్డ్ అలాగే అఫినిము , క్యాసినో వ్యాపారాలపై పట్టు సాధించాలనుకునే గ్యాంగ్‌స్టర్ ‘రాయా’ (యష్) కథను చెబుతుంది. తన సోదరితో అనుబంధం, తన జీవితంలోని వివిధ మహిళలతో సంబంధాలు , తన కుమారుడు ‘టికెట్’తో సంఘర్షణ ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సృష్టించిన కల్పిత ప్రపంచం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంత ఇబ్బంది ప‌డింది. ఆ కాలం నాటి నేపథ్యం , గ్యాంగ్‌స్టర్ కథాంశం చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లడానికి బదులుగా, ఈ చిత్రం హింస, రక్తపాతం, శృంగార సన్నివేశాలు , గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడింది. ఫలితంగా, ఇది చాలా తక్కువ సారాంశం కలిగిన, అతిగా సాగే యాక్షన్ చిత్రంగా మిగిలి పోయింది.

Exit mobile version