మోదీ పేరుపై ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన

పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఎంపీ ప్రత్యేక పూజలు

hellotelugu-MPLingameniRamesh

విజ‌య‌వాడ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనుక దుర్గమ్మ ఆశీస్సులతో ప్రధానికి ఆయురారోగ్యాలతో పాటు దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు లభించాలని కోరుతూ విశిష్టమైన ఖడ్గమాల అర్చన చేయించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రజ్రా ప్రస్థానం యాత్ర ప్రారంభమై 2014లో భారత ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ సేవలో నిరంతరం నిమగ్నమైన నరేంద్ర మోదీకి అమ్మ వారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని కోరుతూ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా లింగమనేని రమేశ్ మీడియా తో మాట్లాడారు . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విశ్వ గురుగా రూపొందుతున్న భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగవంతంగా పురోగతి సాగిస్తోందన్నారు. మహిళలు, రైతులు, యువకులు, ఉద్యోగులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు మోదీ పాలనలో తగిన ప్రాధాన్యత లభిస్తుండడంతో సకల జనులు సంతృప్తిగా ఉన్నారన్నారు ఎంపీ. మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రత్యేక శ్రద్ద చూపుతుండడంతో రాష్ట్ర ప్రజల కలలైన రాజధాని అమరావతి, పోలవరం పనులు నిరాటంకంగా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. సకల సదుపాయలతో ప్రత్యేకంగా నిలిచిన భోగాపురం విమనాశ్రయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం మోదీకి రాష్ట్రంపై ఉన్న ప్రత్యేక ప్రేమకు నిదర్శనమని లింగమనేని రమేష్ అన్నారు.

దేశ వ్యాప్తంగా రైల్వే, జాతీయ రహదారుల పనులు వేగవంతంగా జరుగుతున్న దశలో ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా ఎనలేని ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధితోపాటు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్ర‌దానికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని కోరుతూ ఆయన పేరిట పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల పూజ నిర్వహించే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Exit mobile version