కేర‌ళ నాకు బాగా కలిసొచ్చింది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన రేణుకా సింగ్

helloteelugu-RenukaSinghThakur

తిరువ‌నంత‌పురం : మ‌హిళా క్రికెట‌ర్ రేణుకా సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మూడో టి20 మ్యాచ్ లో దుమ్ము రేపింది టీమ్ ఇండియా. 5 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇండియా ఇప్ప‌టికే 3-0 తేడాతో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. శ్రీ‌లంక‌పై భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేయ‌డంలో కీల‌క‌మైన పాత్రను పోషించింది బౌల‌ర్ రేణుకా సింగ్. భారత్ మహిళలు శ్రీలంక మహిళలపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందారు. రేణుకా సింగ్ ఠాకూర్ త‌ళుక్కున మెరిసింది. త‌న అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. కేవ‌లం 21 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చిన రేణుకా సింగ్ ఏకంగా 4 వికెట్లును తీసింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది విమెన్ అవార్డును స్వంతం చేసుకుంది.

అయితే సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసిన రేణుక సింగ్ ఠాకూర్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసింది. త‌న బౌలింగ్ దెబ్బ‌తో శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడింది రేణుకా సింగ్ ఠాకూర్. అండర్-19 రోజుల నుండి అక్కడ నిలకడగా నాలుగు వికెట్ల ప్రదర్శనలు చేసినట్లు ఆమె గుర్తుచేసుకుంది . ఇదే వేదిక‌కు తిరిగి రావడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది. నా ప్రదర్శన బాగుంది. నేను చాలా కాలంగా T20 క్రికెట్ ఆడుతున్నాను, కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. కేరళ నాకు అదృష్ట ప్రదేశం. నేను ఇక్కడ ఆడినప్పుడల్లా నాలుగు వికెట్లు తీశానంటూ సంతోషం వ్య‌క్తం చేసింది రేణుకా సింగ్ ఠాకూర్. ఇదే మ్యాచ్ లో మ‌రో బౌల‌ర్ దీప్తి శ‌ర్మ కేవ‌లం 18 ర‌న్స్ ఇచ్చి మూడు కీల‌క వికెట్లు కూల్చింది.

Exit mobile version