సీఎంగా కేసీఆర్ కొలువు తీర‌డం ఖాయం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : ఎన్నో పోరాటాలు, బ‌లిదానాల కార‌ణంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అంత‌కు ముందు ఆయ‌న బ‌లిదానం చేసుకున్న అమ‌ర వీరుల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. కేసీఆర్ చేసిన పోరాటం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్య‌మైంద‌ని చెప్పారు కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఒక జీవన సాఫల్య మూర్తి అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన కృషిని, త్యాగాలను తెలంగాణ నాయకులు విస్మరించి, బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కేటీ రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ త‌ప్ప‌కుండా డిసెంబర్ 2028 నాటికి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు’పుష్కర తెలంగాణ’ ఇప్పుడు ‘ముష్కరుల’ (ఉగ్రవాదుల) చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన కృషిని, త్యాగాలను తెలంగాణ నాయకులు విస్మరించి, బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అమరవీరుల రక్తం ప్రవహించిన చోట సాగునీరు ప్రవహించేలా కేసీఆర్ కృషి చేశారని తెలిపారు.

Exit mobile version