కావ్య మార‌న్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్

స‌న్ రైజర్స్ ఓన‌ర్ హ‌ల్ చ‌ల్

Hellotelugu-KavyaMaran

చెన్నై : త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ద‌యానిధి మార‌న్ వార‌సురాలు కావ్య మార‌న్ సంచ‌ల‌నంగా మారారు. గ‌త ఏడాది అనుకోకుండా ఝ‌ల‌క్ ఇచ్చారు త‌న అభిమానుల‌కు, క్రికెట్ ప్రేమికుల‌కు. త‌ను వ‌చ్చాక ఐపీఎల్ కు మ‌రింత గ్లామ‌ర్ పెరిగింది. త‌ను అంతేకాకుండా ఒక్క‌సారిగా ఐపీఎల్ వేలం పాట‌లో పాల్గొంటూనే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారంది. ఇదే క్ర‌మంలో పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంత‌కంతకూ పెంచుకుంటూ పోయింది. అయితే త‌నే స్వంతంగా ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం ఎక్స్ లో ఖాతాను క‌లిగి ఉంది. నిత్యం త‌న‌కు సంబంధించిన అప్ డేట్స్ ను పొందుప‌రుస్తూ వ‌చ్చింది.

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి గ‌తేడాది తాను ఎక్స్ ఖాతాను క్లోజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది కావ్య మార‌న్. దీంతో పెద్ద ఎత్తున అయ్యో కాప్య పాప‌కు ఏమైందంటూ వాక‌బు చేశారు. త‌ను ఒక్క ఫోటో షేర్ చేసినా లేదా ఏమైనా కామెంట్స్ చేసినా వెంటైన్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ కావ‌డం, దానికి ల‌క్ష‌ల్లో లైక్స్ రావ‌డం జ‌రిగింది. అయ్యో కావ్య పాప ఎంత ప‌ని చేశావంటూ నెటిజ‌న్స్ పేర్కొన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ కావ్య మార‌న్ త‌న మ‌న‌సు మార్చుకుంది. ఇక నుంచి తాను ఎక్స్ లోకి తిరిగి వ‌స్తున్న‌ట్లు తానే స్వ‌యంగా ఎక్స్ వేదిక‌గా వెళ్లడించింది. ఈ ఏడాదిలో ఐపీఎల్ లో పాల్గొనే త‌న స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటోంది.

Exit mobile version