Kasibugga : శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా లోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో ఒకరిపై మరొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఊపిరి ఆడక కొందరు పడి పోయారు. మరికొందరు సొమ్మసిల్లి పడి పోయారు. పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇదిలా ఉండగా ఘటన జరిగిన వెంటనే హుటా హుటిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు కాశీబుగ్గ (Kasibugga) శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. పరిస్తితిని చూసి ఆయన చలించి పోయారు.
Kasibugga Stampede Sensational
సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అంబులెన్స్ లలో బాధితులను తరలించారు. బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.
ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ ఆలయం లో ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందిన విషయం అత్యంత బాధాకరం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మృతుల కుటుంబాలకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
Also Read : Minister Anam Shocking Comments on Kasibugga : కాశీబుగ్గ ఘటనతో సర్కార్ కు సంబంధం లేదు
















