TSUTF Shocking Statement : టెట్ త‌ప్ప‌నిస‌రి అంటే ఒప్పుకోం : యుటిఎఫ్

స్ప‌ష్టం చేసిన ఉపాధ్యాయ సంఘాలు

Hello Telugu - TSUTF Shocking Statement

Hello Telugu - TSUTF Shocking Statement

UTF : హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్త‌ర్వుతో తెలంగాణ రాష్ట్రంలోని పంతుళ్ల‌లో బెంగ మొద‌లైంది. దీంతో ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఎవ‌రైనా స‌రే టీచ‌ర్లుగా ప‌ని చేస్తున్న టీచ‌ర్లు విధిగా టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) ను విధిగా అర్హ‌త సాధించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో దెబ్బ‌కు రోడ్డెక్కారు. టెట్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఎస్సీ తీర్పును సమీక్షించాలని స‌ర్కార్ ను అభ్యర్థించారు. తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. వెంకన్న ఈ సంద‌ర్బంగా మాట్లాడారు. ప్రభావితమైన వారిలో చాలా మంది దశాబ్దాలుగా బోధన చేస్తున్నారని అన్నారు. పదవీ విరమణ కోసం ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న సర్వీస్ సిబ్బంది రెండేళ్ల లోపు పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఇవ్వ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

UTF Key Statement

ఈ నిర్ణ‌యం కార‌ణంగా తెలంగాణలో దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష లో అర్హత సాధించాల్సి రావచ్చు. పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండ‌గా టెట్ సర్టిఫికేట్ లేకుండా ఏ టీచ‌ర్ కూడా పదోన్నతి పొందలేరు. పదవీ విరమణకు ముందు ఐదు సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉన్న వారికి మాత్రమే మినహాయింపు లభించింది. ఈ ఉత్తర్వు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ సిబ్బందిని కలవర పెడుతోంది. ప్రభావితమైన వారిలో చాలా మంది దశాబ్దాలుగా బోధన చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. .వారు తరగతి గదుల్లో తమను తాము నిరూపించుకున్నార‌ని, ఈ స‌మ‌యంలో ప‌రీక్ష పాస్ కావాల‌ని ఆదేశించ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : National Cultural Festivals Interesting : విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

Exit mobile version