గంభీర్, అగార్క‌ర్ పై క‌పిల్ దేవ్ ఫైర్

షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ కెప్టెన్

hellotelugu-Kapildev

హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ నిర్వాకం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ ఇద్ద‌రు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. రోజు రోజుకు జ‌ట్టులో స‌మ‌తుల్యం లోపిస్తుంద‌న్నారు. ఇవాళ క‌పిల్ దేవ్ మీడియాతో మాట్లాడారు. తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో యువ ఆట‌గాళ్లు అద్భుతంగా ఆడుతున్నారంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. కొంద‌రి మెప్పు కోసం ఇష్టానుసారంగా క్రికెట‌ర్ల‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు.

అంతే కాదు కీల‌క ఆట‌గాళ్లకు స్థాన చ‌ల‌నం క‌ల్పించ‌డం దారుణ‌మ‌న్నారు. ఇష్టానుసారంగా ఎంపిక చేయ‌డం ప‌ట్ల మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు క‌పిల్ దేవ్. గంభీర్, అగార్కర్‌కు జై షా ఆశీస్సులు ఉండ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భారత క్రికెట్‌లో ఇంతకు ముందు ఇలాంటి అహంకారం చూడలేదంటూ పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి భారత క్రికెట్‌ను నాశనం చేసే అంచున ఉన్నారనే భావనను వ్య‌క్తం చేశారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్. క‌పిల్ తో పాటు ఇత‌ర మాజీ క్రికెట‌ర్లు, అన‌లిస్టులు పెద్ద ఎత్తున ఎంపిక వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Exit mobile version