Beauty Rukmini Vasanth-Kantara : కాంతారా -1 రుక్మిణి వ‌సంత్ ఫ‌స్ట్ లుక్

క‌న‌కావ‌తి పాత్ర‌లో దుమ్ము రేప‌నుంది

Hello Telugu - Beauty Rukmini Vasanth-Kantara

Hello Telugu - Beauty Rukmini Vasanth-Kantara

Rukmini Vasanth : ప్ర‌ముఖ న‌టి రుక్మిణి వసంత్ వైర‌ల్ గా మారారు. దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది కాంతారా చిత్రం. దీనికి క‌ర్త‌, కర్మ‌, క్రియ అన్నీ ద‌ర్శ‌కుడు, న‌టుడు రిష‌బ్ శెట్టి. మూవీ సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో కాంతారా చాప్ట‌ర్ -1 సీక్వెల్ కు శ్రీ‌కారం చుట్టాడు. శుక్ర‌వారం మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ ఇచ్చారు. త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో మ‌న‌సులు దోచుకున్న న‌టి రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth) ఇందులో కీల‌క పాత్ర పోషించింది. త‌ను ఇందులో క‌న‌కావ‌తి పాత్ర‌ను పోషిస్తోంది. ఇవాళ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. అద్భుతంగా ఉంది ఈ పోస్ట‌ర్. రిలీజ్ చేసిన కొద్ది సేప‌ట్లోనే హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Rukmini Vasanth – Kantara First Look

ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది హోంబలే ఫిల్మ్స్ . సోష‌ల్ మీడియా వేదిక‌గా రుక్మిణి వ‌సంత్ పోస్ట‌ర్ ను షేర్ చేశారు. త‌న‌ను క‌న‌కావ‌తిగా ప‌రిచయం చేస్తున్నామ‌నితెలిపింది సంస్థ‌. ఈ సంవత్సరం జూలై 21న సినిమా పూర్తి అయిందని యూనిట్ ప్రకటించింది. సినిమా ఎలా నిర్మించబడిందో చూపించే వీడియోను కూడా రిలీజ్ చేశారు. మంచి స్పంద‌న వ‌చ్చింది. దీనికి వ‌ర‌ల్డ్ ఆఫ్ కాంతారా అని క్యాప్ష‌న్ పెట్టారు. కాంతారా చాప్ట‌ర్ 1 అనేది ఓ దివ్య‌మైన ప్ర‌యాణం. ఇది మ‌న సంస్కృతిలో లోతుగా పాతుకు పోయింద‌న్నారు.

అచంచలమైన అంకితభావం, అవిశ్రాంత కృషి, అద్భుతమైన బృంద స్ఫూర్తితో ప్రాణం పోసుకుందని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. పురాణ క‌థ‌తో ప్రాణం పోసుకున్న కాంతారా చాప్ట‌ర్ 1 సీక్వెల్ మూవీ అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Also Read : Union Cabinet Approved : రూ.30 వేల కోట్ల ప‌రిహారానికి కేంద్రం ఓకే

Exit mobile version