Hero Dhanush Movie Idly Kadai : ధ‌నుష్ ఇడ్లీ క‌డై తొలి రోజే రూ. 11 కోట్లు

త‌న సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్

Hello Telugu - Hero Dhanush Movie Idly Kadai

Hello Telugu - Hero Dhanush Movie Idly Kadai

Idly Kadai : చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు, భావుకుడు ధ‌నుష్. త‌ను ఎంట్రీతోనే రికార్డ్ బ్రేక్ చేశాడు. దేశ వ్యాప్తంగా వై దిస్ కొల‌వ‌రీ అంటూ ఊపేశాడు. తాజాగా త‌ను న‌టించిన చిత్రం ఇడ్లీ క‌డై  (Idly Kadai) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ పొందింది ఈ మూవీ. ఇందులో ధ‌నుష్ తో పాటు విల‌క్ష‌ణ న‌టి నిత్యా మీన‌న్ కీ రోల్ పోషించింది. ఇరువురు పోటీ ప‌డి న‌టించారు.

స‌హ‌జ న‌ట‌న‌కు పెట్టింది పేరు. ఇటీవ‌లే ధ‌నుష్ తెలుగు సినిమాలో నేరుగా న‌టించాడు. ఆ చిత్రం కుబేర‌. ఓ భిక్ష‌గాడి పాత్ర చేశాడు. ఆ పాత్ర‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. దీనిని తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తీశాడు. క‌థ ప్ర‌ముఖ దివంగ‌త జ‌ర్న‌లిస్ట్ ఎన్ కౌంట‌ర్ పింగ‌లి ద‌శ‌ర‌థ‌రామ్ కూతురు పింగ‌ళి చైత‌న్య రాసింది. ఏకంగా రూ. 100 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. ఇందులో ధనుష్ తో పాటు అక్కినేని నాగార్జున‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్ పోషించారు.

Dhanush Idly Kadai Movie Updates

ఈ ఏడాది త‌న‌కు బిగ్ హిట్ ఇచ్చింది కుబేర‌. తాజాగా మ‌రో హిట్ కొట్టాడు ఇడ్లీ క‌డైతో. తొలి షో నుంచి కొంత నెగ‌టివ్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత ఈ మూవీ దూసుకు పోయింది. ఏకంగా ఒకే ఒక్క రోజులోనే రూ. 11 కోట్లు వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా విడుదలకు ముందు ఓపెనింగ్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్‌ను సాధించింది. 7వ అతిపెద్ద ఓపెనింగ్‌గా రికార్డ్ సృష్టించింది ఇడ్లీ క‌డై. ఇక ధ‌నుష్ కెరీర్ లో అత్య‌ధిక ఓపెనింగ్ క‌లెక్ష‌న్ చేసిన సినిమాల‌లో ఇది మూడోది కావ‌డం విశేం. కెప్ట‌న్ మిల్ల‌ర్ తొలి రోజు రూ. 8.80 కోట్లు సాధించ‌గా , కుబేరా రూ. 14.75 కోట్లు, రాయ‌న్ రూ. 13.70 కోట్లు వ‌సూలు చేసిన వాటిలో ఉన్నాయి.

Also Read : Elon Musk Sensational : ఎలాన్ మ‌స్క్ భారీ వేత‌నం బోర్డు అభ్యంత‌రం

Exit mobile version