Kantara 1 Sensational Collections : వ‌సూళ్ల వేట‌లో కాంతారా చాప్ట‌ర్ -1 రికార్డ్

కాంతారా రికార్డ్ ను బ్రేక్ చేసిన సీక్వెల్

Hello Telugu - Kantara 1 Sensational Collections

Hello Telugu - Kantara 1 Sensational Collections

Kantara 1 : బెంగ‌ళూరు : క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టుడు, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి. త‌ను న‌టించిన తాజా సీక్వెల్ మూవీ కాంతారా చాప్ట‌ర్ -1 (Kantara 1) దుమ్ము రేపుతోంది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా వ‌సూళ్ల‌లో దూసుకు పోతోంది. దీంతో మూవీ టీం ముచ్చ‌ట ప‌డుతోంది. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌లే చిత్ర బృందం ఢిల్లీ సీఎం ఆహ్వానం మేర‌కు క‌లిసింది. ఈ సంద‌ర్బంగా రిష‌బ్ శెట్టితో పాటు న‌టీ న‌టుల‌ను రేఖా గుప్తా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌తి ఒక్క‌రు ఈ మూవీని చూడాల‌ని పిలుపునిచ్చారు. ఇక తాను న‌టించిన కాంతారా చిత్రం గ‌తంలో రూ. 400 కోట్లు వ‌సూలు చేసింది వ‌ర‌ల్డ్ వైడ్ గా . అది అప్ప‌ట్లో రికార్డ్ బ్రేక్. క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా ప్ర‌శాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ ఉంది. ప్ర‌స్తుతం దాని ద‌రిదాపుల్లో నిలిచాయి కాంతారా, కాంతారా చాప్ట‌ర్ -1 .

Kantara 1 Movie Collections

తాజాగా సినీ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం కాంతారా చాప్ట‌ర్ -1 ఇవాల్టి వ‌ర‌కు ఏకంగా రూ. 410 కోట్లు వ‌సూలు చేసింది వ‌ర‌ల్డ్ వైడ్ గా. థియేటర్లలో భారీ అంచనాలతో ప్రారంభమైంది ఈ మూవీ. కేవలం ఆరు రోజుల్లోనే దాని 2022 ఒరిజినల్ జీవితకాల వసూళ్లను అధిగమించింది. ఒక్క ఇండియాలో రూ. 300 కోట్లు దాటింది. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే 1వ రోజు రూ. 61.85 కోట్లు, 2,3 రోజుల్లో 45.4 కోట్లు, 4వ రోజు రూ.63 కోట్లు వ‌సూలు చేసింది. 5వ రోజు రూ. 31.5 కోట్లు, 6వ రోజు రూ. 34.25 కోట‌లు, 7వ రోజు రూ. 25 కోట్లు వ‌సూలు అయ్యాయి. దేశీయ ప‌రంగా ఇప్ప‌టి వ‌ర‌కు నిక‌రంగా రూ. 316 కోట్లు వ‌సూలు చేసింది కాంతారా చాప్ట‌ర్ -1 . రాబోయే రోజుల్లో మ‌రిన్ని వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంది.

Also Read : Harish Rao Fired on Congress : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

Exit mobile version