Kanipakam Vinayaka : చిత్తూరు జిల్లా – ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు 21 రోజుల పాటు కాణిపాకంశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు (Kanipakam Vinayaka) జరగనున్నాయి. మంగళవారం కాణిపాకం ఆలయ పరిపాలన భవనం లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఎమ్మెల్యే కె. మురళీ మోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఈఓ అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ద్వారా ప్రాథమిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
Kanipakam Vinayaka Brahmotsavam Updates
ఆలయ ఈవో, విద్యుత్ అధికారులు, ఫైర్ ఆఫీస్ అధికారులు సమగ్రంగా ఆలయం వెలుపల, లోపల విద్యుత్ సౌకర్యం ఎలా ఉన్నది, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో పరిశీలించాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నుండి కాణిపాకం (Kanipakam Vinayaka) వచ్చే రోడ్లకు ఇరువైపులా ముళ్ళ చెట్లు, పొదలను చదును చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
చిత్తూరు ఆర్డిఓ ఆధ్వర్యంలో ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రోటోకాల్ నందు ఎమ్మార్వోలను, డిప్యూటీ ఎమ్మార్వోలను విధులు నిర్వహించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చిత్తూరు ఆర్డీవో పర్యవేక్షణలో పై కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ప్రత్యేక డిఎస్పి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, హోంగార్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దేవాలయ ప్రాంగణం, సూపద మండపం, కోనేరు, పార్కింగ్ బస్టాండు ,కళ్యాణ్ కట్ట వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా, దేవస్థానం ఆధ్వర్యంలో సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఉన్నాయని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఫ్లెక్సీలు, బ్యారికేడ్స్ పటిష్టంగా ఉండాలని తెలిపారు, తమ ఆధ్వర్యంలో రెండు డ్రోన్లు కెమెరాలు పనిచేస్తాయని, అలాగే ఆలయం ఆధ్వర్యంలో రెండు డ్రోన్ కెమెరాలు ఉండాలని తెలిపారు. భక్తులను అప్రమత్తంగా ఉండేందుకు మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఆలయం అధికారులు కల్పించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా మద్యం అమ్మకాలు ఉండ కూడదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Vande Bharat Sleeper Growth : వందే భారత్ స్లీపర్ క్లాస్ పై కీలక అప్డేట్ ఇచ్చిన రైల్వే శాఖ
















