Minister Kandula Durgesh-Vizag Growth : వినోద రంగానికి కేరాఫ్ వైజాగ్ న‌గ‌రం

మంత్రి కందుల దుర్గేష్ వెల్ల‌డి

Hello Telugu - Minister Kandula Durgesh-Vizag Growth

Hello Telugu - Minister Kandula Durgesh-Vizag Growth

Kandula Durgesh : విశాఖ‌పట్నం : ప‌ర్యాట‌క‌, వినోద రంగాల‌కు గ‌మ్య స్థానంగా విశాఖ‌ప‌ట్నం మార‌నుంద‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). శుక్ర‌వారం ఏపీ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత‌క్మంగా సీఐఐ భాగ‌స్వామ్య స‌దస్సును ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన మంత్రులు హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం దేశ ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో పాటు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ పాల్గొంటారు. ఈ సంద‌ర్బంగా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యే కంటే ముందు మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఇండియాలోనే తొలుత ఏర్పాటు చేసిన ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించారు.

Minister Kandula Durgesh Key Comments on Vizag

వినోదాన్ని కోరుకునే వారికి వైజాగ్ ప్రసిద్ధ గమ్యస్థానంగా మార బోతోంద‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. నగర జీవితంలోని గందరగోళం, ఒత్తిడితో కూడిన రోజువారీ జీవితం నుండి విశ్రాంతి తీసుకోవాలని అనుకునే వారికి వైజాగ్‌లోని థీమ్ పార్క్ లు మంచి ఉపశమనాన్ని ఇస్తున్నాయని చెప్పారు కందుల దుర్గేష్. అద్బుతంగా ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. అమ్యూజ్ మెంట్ పార్క్ మాయా ప్రపంచం అని పేర్కొన్నారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా కుటుంబం, స్నేహితులతో కలిసి ఆనందంగా ఉత్కంఠ భరితమైన రోజును గడిపే ప్రదేశంగా ఉండ‌డం ప‌ట్ల నిర్వాహ‌కుల‌ను అభినందించారు మంత్రి.

Also Read : Minister Uttam Kumar Important Update : ప్ర‌తిష్టాత్మ‌కంగా యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్

Exit mobile version