Minister Kandula Durgesh Interesting Comments : ‘రాజీ’ చిత్రానికి క్లాప్ కొట్టిన కందుల దుర్గేష్

ఈ చిత్రం విజ‌యం చేకూరాల‌ని కామెంట్

Hello Telugu - Minister Kandula Durgesh Interesting Comments

Hello Telugu - Minister Kandula Durgesh Interesting Comments

Kandula Durgesh : అమ‌రావ‌తి : రాంకీ హీరోగా , నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్న చిత్రం రాజీ విజ‌యం సాధించాల‌ని కోరారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ (Kandula Durgesh). డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురం శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారి ఆలయంలో రాంకీ మీడియా ప్రైవేట్ లిమిడెట్ బ్యానర్ పై సత్య వెంకట ప్రసాద్ గెద్దాడ దర్శకత్వంలో రాంకీ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న “రాజీ” (No Compromise) చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్న‌ట్లు తెలిపారు.

Minister Kandula Durgesh Claped The ‘Raaji’ Movie

సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్. పరిశ్రమకు మేలు చేకూర్చేలా షూటింగ్ లకు అనువైన వాతావరణం కల్పించేలా త్వరలోనే ఒక అద్భుతమైన “నూతన ఫిల్మ్ పాలసీ” ని తీసుకు రాబోతున్నాం అని ప్ర‌క‌టించారు. సినీ రంగం అభివృద్దికి కూట‌మి స‌ర్కార్ కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు కందుల దుర్గేష్ రాష్ట్రంలో సినీ రంగానికి చెందిన నిర్మాత‌లు, న‌టీ న‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్నారు. ఇక్క‌డ సినీ స్టూడియోలు ఏర్పాటు చేస్తే రాయితీలు, వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు మంత్రి.

Also Read : Harish Rao Shocking Comments : కుల గ‌ణ‌న స‌ర్వే పేరుతో రూ. 200 కోట్లు ఖ‌ర్చు

Exit mobile version