Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై. ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఆగమేఘాల మీద ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 12 నాడు బీసీలకు రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుంది కావచ్చు. ఎందుకు ఈ హడావుడి అని మండిపడ్డారు హరీశ్ రావు (Harish Rao). డ్రామా ఏమైనా చేస్తున్నారా సినిమా నడుపుతున్నారా అని ప్రశ్నించారు. క్షణాల్లో బుసాని కమీషన్ రిపోర్ట్ ఇస్తారంట అప్పటికప్పుడు జీవో 46 తెస్తారట అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగం అంటే భక్తి భయం లేదా? పాలకుడికి భయం భక్తి ఉండాలని అన్నారు హరీశ్ రావు.
Ex Minister Harish Rao Slams Congress Govt for Caste Sensus
కుల గణన సర్వే పేరిట రూ. 200 కోట్లు ఖర్చు చేశారని, ఏమైందని ప్రశ్నించారు. పాలాభిషేకం, పూలాభిషేకం చేయించుకుంటి ఎలా అని ఫైర్ అయ్యారు హరీశ్ రావు. రేవంత్ గౌడ్ అంటిరి.. రేవంత్ యాదవ్ అంటివి.. రేవంత్ ముదిరాజ్ అంటిరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నించారు.
కుల గణన సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా సర్కార్ రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీల పేరుతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మీది కాదా అంటూ ఫైర్ అయ్యారు. కుల గణన పేరుతో ఎవరికి లాభం చేకూరిందంటూ నిలదీశారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : KTR Clear Instructions : కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ మోగించాలి
