హైదరాబాద్ : ప్రముఖ జనాదరణ పొందన షో బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాలకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ‘ఫన్’ అనే హారర్ కామెడీ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు. హేమంత్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ తెలుగు హారర్-కామెడీ చిత్రం ‘ఫన్’ ద్వారా కళ్యాణ్ పడాల ప్రధాన నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం పూజా కార్యక్రమాలను నిర్వహించి, నవంబర్ 12 నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ధృవీకరించింది.
ఈ చిత్రానికి హేమంత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా జి. సంతోషి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కళ్యాణ్ పడాలతో పాటు సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి. యశోర, సోనియా నాయుడు, జె.డి.వి. ప్రసాద్, బేబీ జస్విత , మాస్టర్ హనీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ గోపాల్ సంగీతం సమకూరుస్తుండగా జి.ఎల్. బాబు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత కళ్యాణ్ పడాల ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతుండటంతో, ఆయన అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.


















