హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే మే నెలలో మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ప్రకటించారు. తన తొలి ప్రయారిటీ సిద్దిపేట ఉంటుందన్నారు. రెండో ఛాయిస్ బోధన్ ను నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందన్నారు. తెలంగాణలో తామే అసలైన ప్రధాన ప్రతిపక్షంగా మార బోతున్నట్లు చెప్పారు కవిత. ఇక నుంచి తెలంగాణలో బీజేపీ అనేది ఉండదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత. ఇప్పటి వరకు పార్టీ పరంగా 50 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనేక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు తమ పార్టీకి గుర్తు వస్తే దానిపై పోటీ చేస్తామని ప్రకటించారు . వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్ట పొత్తుతో బరిలో ఉంటామన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో మేమే ఏ ప్రధాన ప్రతి పక్షం. తమ పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చాల మంది నాతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే ఇప్పుడే ఎవరు తనతో టచ్ లో ఉన్నారనే విషయం ప్రకటించడం లేదన్నారు కల్వకుంట్ల కవిత.
