కేటీఆర్ పై క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్

ప‌దేళ్లు ప‌వ‌ర్ లో ఉండి ఏం చేశారంటూ ఫైర్

hellotelugu-MLCKavitha

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత . బుధ‌వారం టీజీఎస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న సోద‌రుడిని ఏకి పారేసింది. సికింద్రాబాద్ జిల్లా చేయాలి అని ఉద్యమం చేస్తున్న కేటీఆర్ గారిని చూసి నవ్వుకున్నా

పదేండ్లు అధికారంలో ఉండి జిల్లా చేయకుండా ఉన్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసన్నారు. జిల్లా చేయాలని ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టిన వారే ఈరోజు ఉద్యమం చేయడం చూస్తే నవ్వు వస్తుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కవిత కల్వకుంట్ల. పార్టీలు వేరైనా.. జాగృతి ఎజెండా ఒక్కటే అని అన్నారు. అది తెలంగాణ ఫస్ట్ అని ప్ర‌కటించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్ర‌శ్నించారు.

తెలంగాణ అస్థిత్వమే ఊపిరిగా, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ..రేపటి యువతకు స్ఫూర్తినిచ్చేలా ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోందంటూ మండిప‌డ్డారు తీవ్ర స్థాయిలో. కేవ‌లం ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే రిజ‌ర్వేష‌న్లు గుర్తుకు వ‌స్తాయ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Exit mobile version