K Kavitha Fired on Congress Govt : పాల‌మూరు ప్ర‌జ‌లు సీఎంను క్షమించ‌రు

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Hello Telugu - K Kavitha Fired on Congress Govt

Hello Telugu - K Kavitha Fired on Congress Govt

K Kavitha : పాల‌మూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఆమె ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్ ను సంద‌ర్శించారు. అనంత‌రం క‌విత (K Kavitha) మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని ఎప్ప‌టికీ క్షమించరని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టినా రివ్యూ పిటిషన్ వేయక పోవటం దారుణం అన్నారు క‌విత‌. సీడ్ల్యూసీ ప్రాజెక్ట్ ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసిందని ఆరోపించారు.

K Kavitha Slams CM Revanth Reddy

అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించు కోవటం లేదని మండిప‌డ్డారు. సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు క‌విత‌. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని కృష్ణానది అని పేర్కొన్నారు. అలాంటి కృష్ణానదిలో తెలంగాణ సిద్దించిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవటం జరిగిందని చెప్పారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్త‌య్యాయ‌ని చెప్పారు. ఇంకా 20 శాతం ప‌నులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఫైర్ అయ్యారు.

ఉద్దండపూర్, కరివెన లో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయ లేదన్నారు క‌విత‌. నార్లపూర్ నుంచి ఎదెల వరకు వచ్చే టన్నెల్ పనులను చేయక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : CM Revanth Reddy Important Update : నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై నివేదిక‌లు సిద్దం చేయాలి

Exit mobile version