K Kavitha : సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). బుధవారం తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ సంయుక్తంగా లక్డీకపూల్ లోని సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. కవిత పిలుపు మేరకు పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు మద్దతుగా నిలిచారు. చాలా చోట్ల అక్రమ అరెస్ట్ లకు పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారని, అలా అని అరెస్ట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు తిప్పారపు సారయ్య సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.
K Kavitha Demand for Medical Board Setup
నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం పట్ల మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని కోరారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర, దేశ అభివృద్దిలో కీలకమైన భూమిక పోషిస్తున్నారని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. సింగరేణి బెల్ట్ వ్యాప్తంగా కొనసాగుతున్నహెచ్ఎంఎస్, తెలంగాణ జాగృతి నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తక్షణమే రిలీజ్ చేయాలని కోరారు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గత కొన్ని రోజుల నుంచి జనం బాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపుతున్నారు. సర్కార్ ను నిలదీస్తున్నారు.
Also Read : TG High Court Fired on Hydraa Commissioner : హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్
