K Kavitha : ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) దూకుడు పెంచారు. ప్రస్తుతం ఆమె ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె సుడిగాలి పర్యటన చేశారు. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించిన నిజామాబాద్ జిల్లా నుంచి జాగృతి జనం బాటకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఉద్దండాపూర్ రైతులతో, నిర్వాసితులతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలి పోయిన 20 శాతం పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా కవిత జనం బాట కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది.
K Kavitha Demands
ఇందులో భాగంగా జిల్లాలోని చనాకా కొరటా ప్రాజెక్ట్ ను సందర్శించారు కల్వకుంట్ల కవిత. 50 వేల ఎకరాలకు పైగా నీళ్లు ఇచ్చేందుకు చేపట్టారు ఈ ప్రాజెక్టును. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 90 శాతం ప్రాజెక్టులు పనులు పూర్తయ్యాయి. ఇంకా కేవలం 10 శాతం మాత్రమే పనులు ఆగి పోయాయి. దీనిపై సీరియస్ అయ్యారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ప్రభుత్వ రెండు ఏండ్ల పాలనలో 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేక పోయిందంటూ మండిపడ్డారు. ప్రాజెక్ట్ కోసం తీసిన కాల్వల్లో వరద నీళ్లు ఓవర్ ఫ్లో అయి పంటలు పాడవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. కొరాట గ్రామంలో నిర్వాసితులు 213 మంది ఉన్నారని, వారికి తక్షణమే పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
Also Read : KTR Challenge for Jubilee Hills : గెలుపు పక్కా తేలాల్సింది లెక్క : కేటీఆర్


















