K Kavitha Fired on Govt : లెద‌ర్ పార్క్ ప‌రిశ్ర‌మ ఆల‌స్యంపై క‌విత ఫైర్

త‌క్ష‌ణ‌మే ఏర్పాటు చేయాల‌ని స‌ర్కార్ కు డిమాండ్

Hello Telugu - K Kavitha Fired on Govt

Hello Telugu - K Kavitha Fired on Govt

K Kavitha : ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (K Kavitha) తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారం జాగృతి జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మొద‌ట మ‌ధిర లెద‌ర్ పార్కు ప్ర‌తిపాదిత స్థ‌లాన్ని సంద‌ర్శించారు. అనంత‌రం స‌త్తుప‌ల్లి ఓపెన్ కాస్ట్ ను సందర్శించారు. ఈసంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. లెదర్ పార్క్ పరిశ్రమ ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై స్థానికులతో మాట్లాడటం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు నిర్మాణం చేప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే లెద‌ర్ పార్కు ను ఏర్పాటు చేయాల‌ని ఆమె తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ ను డిమాండ్ చేశారు.

K Kavitha Slams Govt

ఇక్క‌డ లెద‌ర్ పార్కు గ‌నుక ప్రారంభిస్తే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా స్థానికుల‌కు, నైపుణ్యం క‌లిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు దీనిపై శ్ర‌ద్ద పెట్ట‌లేదో పాల‌కుల‌కే అర్థం కావాల‌న్నారు. రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్త‌యినా ఇంకా స‌మ‌స్య‌లు ఎక్క‌డిక‌క్క‌డ తిష్ట వేసి ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే తాను స‌ర్కార్ దృష్టికి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలియ చేస్తున్నాన‌ని, వాటిని ప‌రిష్క‌రించేంత వ‌ర‌కు తాను నిద్ర పోన‌ని, సీఎంను నిద్ర పోనివ్వ‌నంటూ స్ప‌ష్టం చేశారు. ఇక ఓపెన్ కాస్ట్ గ‌నుల్లో ప‌ని చేస్తున్న వారికి కూడా ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె కోరారు.

Also Read : Hero Chiranjeevi-IBomma : టాలీవుడ్ ను పైర‌సీ నుంచి రక్షించారు

Exit mobile version