అరాచ‌క పాల‌న సాగిస్తున్న డీఎంకే స‌ర్కార్

నిప్పులు చెరిగిన బీజేపీ మాజీ చీఫ్ అన్నామ‌లై

hellotelugu-KAnnamalai

చెన్నై : భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ చీఫ్‌, సీనియ‌ర్ నాయ‌కుడు కె. అన్నామ‌లై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ంలో ప్ర‌జా పాల‌న సాగ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ సార‌థ్యంలో అరాచ‌క పాల‌న సాగిస్తూ అన్ని వ‌ర్గాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌మంటూ మండిప‌డ్డారు. మాట్లాడేందుకు స్వేచ్ఛ కూడా లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాపోయారు కె. అన్నామ‌లై. తమిళనాడులోని అరివాలయం ప్రభుత్వం ప్రజల గొంతులను అణచివేసే స్థాయికి దిగజారిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనకు అనుమతి నిరాకరించడమే కాకుండా తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింద‌న్నారు.

తిరుపూర్ కార్పొరేషన్ బలవంతంగా చెత్త డంప్‌ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇడువాయి నివాసితులకు మద్దతుగా బీజేపీ నిలిచింద‌ని చెప్పారు కె. అన్నామ‌లై. శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేసిన త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసింద‌న్నారు. ఇది పాలన కాదని ఇది పచ్చి అణచివేత త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు సీనియ‌ర్ నాయ‌కుడు. ఎన్ని అణిచివేత‌ల‌కు గురి చేసినా , ఇబ్బందులు పెట్టినా వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజల తరఫున గొంతుకగా కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. అవినీతి, దుర్మార్గపు పాలన కు డీఎంకే కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు కె. అన్నామ‌లై.

Exit mobile version