కోయంబత్తూరు : భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, తమిళనాడు మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రధానంగా అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు కొత్తగా పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు , టీవీకే విజయ్ ను టార్గెట్ గా చేసుకున్నారు. తనను కావాలని లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విజయ్ నటుడు కావడంతో తనకు ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అందుకే యువత ఎక్కువగా తనను చూసేందుకు వస్తున్నారని, కానీ ఓట్లు వేసేందుకు కాదన్నారు కె అన్నామలై.
ఆయన వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. ఆయన సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. ప్రజలు వస్తున్నారు. యువతరం ఆయనను చూడటానికి వస్తోంది. కానీ పాలన అనేది వీటన్నింటికీ పూర్తిగా భిన్నమైన విషయం అని తెలుసుకుంటే మంచిదన్నారు బీజేపీ మాజీ చీఫ్. ఆయనకు మంచి ఓట్ల వాటా లభించే అవకాశం ఉండవచ్చు. ఆ విషయాన్ని ఎవరూ కాదనడం లేదన్నారు. కానీ ఆ ఓట్ల వాటా మా గెలుపు అవకాశాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని ప్రకటించారు.. క్షేత్రస్థాయిలో మాకు ఈ విషయంపై పూర్తి స్పష్టత ఉందన్నారు కె. అన్నామలై. కాబట్టి, ఈ ఎన్నికల పోరు అనేది DMK నేతృత్వంలోని అధికార కూటమికి, AIADMK నేతృత్వంలోని NDA కూటమికి మధ్య జరిగే ఒక ద్విముఖ పోరాటం మాత్రమేనని పేర్కొన్నారు.
