బాధిత కుటుంబాల‌కు జ‌న‌సేన భ‌రోసా

గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య చికిత్స

hellotelugu-KandullaDurgesh

అమ‌రావ‌తి : కాకినాడ‌లో చోటు చేసుకున్న అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని నింపింది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ప‌లువురు మంత్రులు ఘ‌ట‌నపై తీవ్రంగా స్పందించారు. తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ , కాకినాడ జనసేన పార్టీ ఇంచార్జి , డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో కలిసి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన దుర్ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్.

ఘటనా స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ, పోలీసు , అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కందుల దుర్గేష్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Exit mobile version