CM Chandrababu – AP Ports Growth : ఏపీ పోర్టుల అభివృద్ధికి సింగపూర్ మోడల్

టువాస్ పోర్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

Hello Telugu - CM Chandrababu - AP Ports Growth

Hello Telugu - CM Chandrababu - AP Ports Growth

CM Chandrababu : సింగపూర్ – ఏపీ పోర్టుల అభివృద్దికి సింగ‌పూర్ మోడ‌ల్ ను ఉప‌యోగిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆ దేశం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉందని.. తీర ప్రాంతం ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంద‌న్నారు ఈ సంద‌ర్బంగా సీఎం. దీంట్లో భాగంగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంద‌న్నారు.

CM Chandrababu Key Comments on AP Ports Growth

ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సీఎం బృందం సందర్శించి అధ్యయనం చేసింది. టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథార్టీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీఎం చంద్రబాబు (CM Chandrababu) భేటీ అయ్యారు. పోర్టు నిర్మాణం మొదలుకుని పోర్టు నిర్వహాణ, కార్యాకలాపాలు వంటి అంశాలపై టువాస్ పోర్టు అధికారులతో చంద్రబాబు బృందం చర్చించింది. పోర్టు కార్యకలాపాల నిర్వహాణలో ఏఐ లాంటి సాంకేతిక అంశాలను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై ఆరా తీశారు చంద్ర‌బాబు నాయుడు.

టువాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుతో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను పరిశీలించారు. అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టు నిర్మాణానికి ఎంత ఖర్చు అయింద‌ని, ఎన్ని విడతల్లో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నారనే అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా రూ. 1.70 లక్షల కోట్ల వ్యయంతో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నట్టు పోర్టు అథార్టీ సీఈఓ విన్సెంట్ చెప్పారు. నాలుగు విడతలుగా పోర్టును నిర్మించాలని తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు.

Also Read : AP Liquor Scam – Chinta Mohan : ఏపీ లిక్క‌ర్ స్కామ్ పై వాస్త‌వాలు బ‌య‌ట పెట్టాలి

Exit mobile version