అమెజాన్ ప్రైమ్ వీడియోలో జైల‌ర్ -2 సందడి

రూ. 820 కోట్లు వ‌సూలు చేసిన ర‌జ‌నీకాంత్ మూవీ

hellotelugu-Jailer-2

హైద‌రాబాద్ : స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన చిత్రం జైల‌ర్ -2. దీనికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో కీ రోల్ పోషించాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 15న విడుద‌లైంది. ఏకంగా రూ. 750 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక త‌లైవా సినీ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ఓటీటీలో సినిమాను చూసేందుకు . ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంద‌ని వెల్ల‌డించారు . ముత్తువేల్ పాండియన్ పాత్ర‌లో న‌టించ‌డు ర‌జ‌నీకాంత్. ఇది పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్ కథ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా ‘జైలర్ 2’ నిలిచింది. విడుదలైన 21 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 820 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, దీపావళి సెలవుల ముగిసే సమయానికి రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది.

మరోవైపు ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘అమెజాన్ ప్రైమ్’ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించి, రజనీ అభిమానులకు శుభవార్త అందించింది. ఆ పోస్ట్‌లో, “టైగర్ ముత్తువేల్ పాండియన్ తిరిగి వచ్చేశాడు. జైలర్ 2′ చిత్రం నవంబర్ 12 నుండి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. కథ విషయానికొస్తే మాజీ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మొదటి భాగంలో సమాజ శ్రేయస్సు కోసం తన సొంత కుమారుడినే అంతం చేసిన ముత్తువేల్ పాండియన్, ఈ రెండో భాగంలో విలన్ ఎస్.జె. సూర్య నేతృత్వంలోని నేరస్థుల ముఠాను ఎలా వేటాడాడనేదే ఈ చిత్ర కథాంశం. అంతే కాకుండా హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి అగ్ర నటుల ప్రత్యేక అతిథి పాత్రలు ఈ చిత్రానికి మరింత ఆకర్షణను జోడించాయి. ‘జైలర్ 2’ చిత్రానికి లభించిన అద్భుతమైన స్పందన పట్ల దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version