జ‌గ‌న్ రెడ్డీ డీఎస్సీపై అబండాలు వేయడం మానుకో

ద‌మ్ముంటే , ఆధారాలు ఉంటే చ‌ర్చ‌కు రావాలి

hellotelugu-SSavitha

అమరావతి : మెగా డీఎస్సీని పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పకడ్బందీగా నిర్వహించారని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడం సరికాదన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువత కష్టాన్ని తక్కువ చేసి చూపొద్ద‌న్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కిన వారికి నీ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం ఒక లెక్క కాదన్నారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా అని స‌వాల్ విసిరారు ఎస్. స‌విత‌. మెగా డీఎస్సీపై రోజంతా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్ర‌క‌టించారు. సీఎం చంద్రబాబు నాయుడు 14కు పైగా డీఎస్సీలు నిర్వహించి, రెండు లక్షల వరకూ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామ‌న్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా డీఎస్సీలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించన అసమర్థుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. డీఎస్సీ అంటేనే జగన్‌కు మొదటి నుంచి విషం కక్కుతున్నారన్నారు. నోటిఫికేషన్ రాగానే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారన్నారు.

మంత్రి నారా లోకేశ్ ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి మెగా డీఎస్సీని అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నిర్వహించారన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే, వారందరినీ గొడ్డలి పార్టీ అవమానిస్తోందని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా, పోయినా టీచర్లను అవమానించడమే పనిగా పెట్టుకోవడం మానుకోవాలని హితవు పలికారు. అయిదేళ్ల పాలనలో ఉపాధ్యాయులను అన్ని విధాలా జగన్ వేధించారని మంత్రి సవిత మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు 14 డీఎస్సీలు నిర్వహించారని, వాటి ద్వారా రెండు లక్షలకు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఏ డీఎస్సీలోనూ అక్రమాలకు తావులేకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. 2025 మెగా డీస్సీపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని జగన్ కు హితవు పలికారు. డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు ఉన్నా.. దమ్ము, ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి చర్చకు రావాలని అన్నారు.

Exit mobile version