నేర‌స్తుల‌ను ప్రోత్స‌హిస్తున్న జ‌గ‌న్ రెడ్డి

నిప్పులు చెరిగిన ప‌ల్లా శ్రీ‌నివాస రావు

hellotelugu-PallaSrinivasaRao

అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు , ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఫ్ర‌స్టేష‌న్ తో నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కూట‌మి స‌ర్కార్ చూస్తూ ఊరుకోద‌ని వార్నింగ్ ఇచ్చారు. నేర మన‌స్త‌త్వం క‌లిగిన జ‌గ‌న్ రెడ్డి క్రిమిన‌ల్స్ కు వ‌త్తాసు ప‌లుకుతూ వారిని ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేలా చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. జ‌నం దేనినైనా భ‌రిస్తారు కానీ నేర స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తుల‌ను, నాయ‌కుల‌ను భ‌రించ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌నైనా జ‌గ‌న్ త‌న ప‌ద్ద‌తిని మార్చు కోవాల‌ని హిత‌వు ప‌లికారు.

మారణ ఆయుధాలు పట్టి ప్రదర్శనలు చేసే వారిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. సంబంధిత అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్టుబడిదారులను భయపెట్టే కుట్ర కోణంలో భాగంగా జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీడీపీ అధ్య‌క్షుడు. జగన్ పుట్టినరోజున వేట కొడవళ్ళతో వైసీపీ శ్రేణులు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడం బాధాక‌ర‌మ‌న్నారు. మారణాయుధాలతో ఈ తరహా ప్రదర్శనలు ఉపేక్షించదగ్గవి కాద‌న్నారు. తమకు నచ్చని వారిని రఫా రఫా నరుకుతాం అని ప్లకార్డుల ప్రదర్శన ను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Exit mobile version