చంద్ర‌బాబు బెయిల్ రూల్స్ ఉల్లంఘ‌న : జ‌గ‌న్

సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్య‌మంత్రి

hellotelugu-YSJaganReddy

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యాడ‌ని, ఆపై త‌ను బెయిల్ పై విడుద‌ల అయ్యాడ‌ని అన్నారు. కేంద్రంలో త‌న ప‌ర‌ప‌తిని అడ్డం పెట్టుకుని ప్ర‌స్తుతం య‌ధేశ్చ‌గా బ‌య‌ట తిరుగుతూ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. శుక్ర‌వారం జ‌గ‌న్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సీఎంపై నిప్పులు చెరిగారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో అధికారంలోకి వ‌చ్చాక కూట‌మి స‌ర్కార్ అడ్డ‌గోలుగా ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు నానా తంటాలు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదే స‌మ‌యంలో తానేదో గొప్ప వ్య‌క్తినైన‌ట్లు అన్నీ తానే క‌నిపెట్టిన‌ట్లు ప్ర‌చారం చేసుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు సీఎంను ఉద్దేశించి జ‌గ‌న్ రెడ్డి. నారా చంద్ర‌బాబు నాయుడు బెయిల్ నిబంధ‌న‌ల‌ను (రూల్స్ ) ను ఉల్లంఘించాడ‌ని మండిప‌డ్డారు. అంతే కాకుండా బాబు అవినీతిని ప్ర‌శ్నించినా లేదా నిల‌దీసినా, ఆధారాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేసినా వారిని బెదిరించ‌డం చేస్తున్నారంటూ వాపోయారు. అంతేకాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని త‌న‌పై ఉన్న కేసుల‌ను చంద్ర‌బాబు నాయుడు మూసేసుకుంటున్నాడ‌ని ఫైర్ అయ్యారు. ప్రచారం ఎక్కువ ప‌ని త‌క్కువ చేస్తున్నాడ‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు సీఎం.

Exit mobile version