Jagan Mohan : హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA). దీనికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రావుతో పాటు మిగతా ఆఫీస్ బేరర్స్ ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. కోర్టు ముందు హాజరు పర్చింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన హెచ్ సీ ఏ ఎన్నికల్లో నానా హంగామా చోటు చేసుకుంది. దీనిపై అప్పటి గులాబీ నేతలు కన్నేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీగా పని చేసిన , భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ కు బహిరంగంగానే సపోర్ట్ చేసింది. ఓ వైపు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ అజ్జూ ప్రెసిడెంట్ గా గెలుపొందాడు.
HCA President Jagan Mohan..
కానీ ఆ తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజ్జూ అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేశారు మిగతా బేరర్స్. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకునేంత దాకా వెళ్లాయి. కేసులు కూడా నమోదయ్యాయి. హరీశ్ రావు, కేటీఆర్ లకు అనుంగు అనుచరుడిగా , వ్యాపారవేత్తగా పేరు పొందిన జగన్మోహన్ రావు ఎంటర్ అయ్యాడు. తనకు గులాబీ పార్టీ ఫుల్ సపోర్ట్ చేసింది. అత్యంత తెలివిగా అజహరుద్దీన్ ను తప్పించారు. ఇదే సమయంలో అజహరుద్దీన్ ఒంటెత్తు పోకడ కూడా తను నిష్క్రమించేందుకు కారణమైంది.
ఇది పక్కన పెడితే మెల మెల్లగా జగన్ మోహన్ రావు (Jagan Mohan) తన ఆధిపత్యాన్ని వహిస్తూ వచ్చాడు. తీరా దొరతనం ప్రదర్శిస్తూ తానే అన్నీ అయినట్లు వ్యవహరించాడు. ఐపీఎల్ టోర్నీ సందర్బంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మాజమాన్యానికి చుక్కలు చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఫిర్యాదు కూడా చేసింది. ఈ మేరకు సదరు మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐకి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కన్ను హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ పోస్టుపై పడింది. ఇప్పటికే అత్యధిక పదవులన్నీ తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్న సీఎం మరో రెడ్డిని అక్కడ కూర్చోబెట్టేందుకు మార్గం సుగమమైంది.
మరో వైపు విచరాణ చేపట్టిన సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది జగన్ మోహన్ రావుపై. నకిలీ పత్రాలతోనే జగన్మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు విచారణలో బట్ట బయలు అయ్యింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కోసం నకిలీ పత్రాలను సృష్టించారని రూఢీ అయ్యింది. నకిలీ పత్రాల ద్వారా ఓ క్లబ్ను ఏర్పాటు చేసి, తద్వారా జగన్మోహన్ రావు HCAలో అధ్యక్షుడిగా పోటీ చేశారని గుర్తించింది.
Also Read : Minister Bandi Sanjay Shocking : తిరుమలలో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి


















