MLA Adinarayana Reddy : అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. తమ కూటమి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, ఇప్పుడు ప్రజల వద్దకు సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. తాము జగన్‌కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం అని చెప్పారు. రాష్ట్రంలో తన భార్య భారతి పేరుతో రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశాడని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి (MLA Adinarayana Reddy). మాజీ ఎంపీ, దివంగత వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ఎంతోమంది పాత్ర ఉందన్నారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
MLA Adinarayana Reddy Shocking Comments on YS Jagan
అసలు దోషులు దాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే తాను , బీటెక్ రవి, సతీష్‌రెడ్డి కలిసి వివేకాను చంపామని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఆది నారాయణ రెడడి. జగన్‌తో పాటు అనేకమంది జైలుకు వెళ్లడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు జగన్ మాట్లాడే ప్రతి మాటకు తాను సమాధానం చెబుతానని అన్నారు. తను ప్రజలతోనే కాదు చచివరకు చెల్లెళ్లతో కూడా ఛీ కొట్టించుకున్నాడని, అయినా బుద్ది రావడం లేదంటూ మండిపడ్డారు ఆది నారాయణ రెడ్డి. తనకు డబ్బులు, పదవి ఉంటే చాలు.. ధర్మం, న్యాయం అవసరం లేదన్నారు.
Also Read : BRS Shocking Complaint on CM : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి















