Jagadish Reddy : హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. ప్రజా పాలన గాడి తప్పిందన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రజలు మాత్రం నమ్మడం లేదన్నారు. ఎన్నికలను కూడా ఒక ప్రహసనంలా మార్చిన ఘనత ఈ సర్కార్ కు దక్కుతుందన్నారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేరిస్తే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కావని అందరికీ తెలుసు అన్నారు జగదీశ్ రెడ్డి. ఇప్పటికే కేసు న్యాయస్థానంలో ఉందని, ఆ తర్వాత ఎన్నికల గురించి మాట్లాడతామన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీలో ధర్నా తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
Jagadish Reddy Slams CM Revanth Reddy
బిల్లులు ఆమోదం పొందక పోయినా జీఓ తీసుకొచ్చి బీసీల కళ్లకు గంతలు కడతారా అని ప్రశ్నించారు.
బీసీలకు రాజ్యాంగం తెలియదా? ఎవరు నమ్ముతారంటూ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు జగదీశ్ రెడ్డి. మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వ వైఖరి అనుమానం కలుగుతోందని చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్థలను ఎలా వదిలించుకోవాలా అన్ని ప్రభుత్వం చూస్తోందన్నారు. మెట్రో వాటా కొనుగోళ్లలో రూ. 1000 కోట్లు చేతులు మారినట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలుచేశారు జగదీశ్ రెడ్డి. ఎల్ అండ్ టీని గట్టెక్కించేందుకే మెట్రోను సీఎం ప్రభుత్వ చేతిలోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆర్టీసీ గురించి తెలిసి కూడా మెట్రో రైలును ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటూ మమండిపడ్డారు. మెట్రో నుంచి వైదొలగిన మరుసటి రోజే ఎల్ అండ్ టీ షేర్లు 24 గంటలలోపే భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై రూ. 15 వేల కోట్ల భారం పడిందన్నారు.
Also Read : CM Chandrababu New Innovation : రాష్ట్రమంతటా జీఎస్టీ ఉత్సవ్ చేపట్టాలి
















