ITR Filing : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక సూచన. సెప్టెంబర్ 15, 2025 నేడు అసెస్‌మెంట్ ఇయర్ 2025–26 కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ (ITR Filing) చేయడానికి చివరి తేదీ. పెనాల్టీ లేకుండా రిటర్న్ సమర్పించాలంటే ఈ రోజు లోపలే ఫైల్ చేయాలి. ఆలస్యం చేస్తే వడ్డీ, పెనాల్టీ తప్పనిసరి అవుతుందని ట్యాక్స్ అధికారులు హెచ్చరించారు.
ITR Filing – ఎందుకు ఇప్పుడే ఫైల్ చేయాలి?
- ఈసారి డెడ్‌లైన్‌ను జూలై 31 నుంచి 6 వారాలు పొడిగించారు.
- ఐటీఆర్ ఫారమ్‌లలో కొన్ని మార్పులు చేయడం వల్ల సమయం ఇచ్చారు.
- ఇప్పటికే 6 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు.
- చివరి నిమిషం వరకు వేచిచూస్తే పోర్టల్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పన్ను విభాగం హెచ్చరించింది.
ఫైలింగ్‌కు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్
- AIS (Annual Information Statement): ఆదాయం, TDS, TCS, ప్రాపర్టీ వివరాలు, సేవింగ్స్ మొదలైనవి.
- ఫారమ్ 16: జీతం, TDS వివరాలతో కంపెనీ ఇచ్చే సర్టిఫికేట్.
- హౌస్ రెంట్ రసీదు: HRA క్లెయిమ్ కోసం అవసరం.
- ఇన్వెస్ట్‌మెంట్ రసీదులు: ఇన్సూరెన్స్, డొనేషన్స్ వంటి చెల్లింపులు.
ఐటీఆర్ ఫారమ్‌లతో ఈ డాక్యుమెంట్స్‌ను అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫైలింగ్ సమయంలో రిఫరెన్స్ కోసం రెడీగా ఉంచుకోవాలి.
ఏ ఫారమ్ ఎవరికి?
- ITR-1: జీతం & ఇతర ఆదాయం కలిపి రూ.50 లక్షల లోపు ఉన్న వ్యక్తులకు. (డైరెక్టర్స్, విదేశీ ఆస్తులు కలిగిన వారికి వర్తించదు).
- ITR-2: వ్యాపారం/ప్రొఫెషన్ ఆదాయం లేని వ్యక్తులు, HUFలకు.
- ITR-3: వ్యాపారం లేదా ప్రొఫెషన్ ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFలకు.
- ITR-4: రూ.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వ్యక్తులు, HUFలు, ఫర్ములు (LLP మినహాయించి) బిజినెస్ ఆదాయం ఉన్నవారికి.
డెడ్‌లైన్ మిస్ అయితే ఏమవుతుంది?
- డెడ్‌లైన్ మిస్ అయితే, ఆదాయం బట్టి పెనాల్టీ, వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
- గత ఏడాది (AY 2024–25)లో 7.28 కోట్ల మంది ITR ఫైల్ చేశారు.
- ఈసారి కూడా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నిపుణుల సూచన:
“ఇప్పుడే ITR ఫైల్ చేయడం ద్వారా పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. డాక్యుమెంట్స్ సిద్దం చేసుకొని ఆలస్యం చేయకూడదు” అని ట్యాక్స్ కన్సల్టెంట్స్ సూచిస్తున్నారు.
Also Read : PM Modi Warning : అసాంఘిక శక్తులకు కాంగ్రెస్ సపోర్ట్ : మోదీ



















