ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏకంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. డ్రామాలు ఆపాలని, ప్రజలకు సంబంధించిన వాస్తవ సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని హితవు పలికారు. నాటకీయత కాదు, అమలు జరిగేలా చూడాలని ప్రతిపక్షాలను మోదీ కోరారు. ఇవాళ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎందుకనో పనిగట్టుకుని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వారికి దేశాన్ని నడిపించే సత్తా లేదన్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని , అందుకే వారికి ఎక్కడికి వెళ్లినా వ్యతిరేకత ఎదురవుతోందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ప్రజలకు ఉత్పాదక సమావేశాన్ని నిర్ధారించడంపై దృష్టి పెట్టాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా నిరాశ ఆవహించిందని, ప్రస్తుతం దేశంలో ఎన్డీయే హవా కొనసాగుతోందన్నారు. దానిని తట్టుకునే శక్తి ప్రతిపక్షాలకు లేకుండా పోయిందన్నారు. జనం తమను నమ్మే స్థితిలో లేరన్నారు. వారిలో నమ్మకాన్ని కల్పించేందుకు ప్రయత్నం చేయకుండా కేవలం తనను, తమ పార్టీని టార్గెట్ చేయడం తప్పా మీరు చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ చేతిలో ఉన్న సమస్యల గురించి ఆలోచించాలని సూచించారు. కానీ డ్రామాలు చేయడం మానుకోవాలని సూచించారు నరేంద్ర మోదీ.
