మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసింది జగనే

నిప్పులు చెరిగిన మంత్రి కొల్లు ర‌వీంద్ర

hellotelugu-KolluRavindra

అమ‌రావ‌తి : మత్స్యకారుల విషయంలో కూడా జ‌గ‌న్ పాలనలో అనేక అన్యాయాలు జరిగాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. చెరువులపై హక్కులను దెబ్బతీసే విధంగా జారీ చేసిన జీవో నెంబర్ 217 ద్వారా వారి జీవనోపాధిని ప్రమాదంలోకి నెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు న్యాయం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మత్స్యకారులకు పెన్షన్ పథకం ప్రారంభమైందని చెప్పారు. వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం కూడా అప్పుడే మొదలైంద‌ని పేర్కొన్నారు.. రూ.4 వేలుగా ప్రారంభమైన ఈ సహాయం నేడు రూ.20 వేల వరకు పెరిగిందన్నారు. ఆయిల్ సబ్సిడీలు, ఇతర సదుపాయాలు కూడా అందిస్తున్నాం అని వెల్ల‌డించారు కొల్లు ర‌వీంద్ర‌.

గతంలో వేటకు వెళ్లి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఐదేళ్ల పాటు సహాయం అందక పోయినా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి వారికి అండగా నిలిచింది అని పేర్కొన్నారు మంత్రి. సముద్ర గస్తీ విషయంలో కూడా జగన్ పాలనలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. 2017లో ఇతర రాష్ట్రాల బోట్లు రాకుండా మెరైన్ బోట్లు గస్తీ కాస్తుండగా, 2019 తర్వాత అవన్నీ నిలిచి పోయాయని ఆరోపించారు. రిపేర్లు, మెయింటెనెన్స్ లకు కూడా డబ్బులు ఇవ్వక పోవడం, సిబ్బందిని తొలగించడం వల్ల సముద్ర సరిహద్దులు బలహీన పడ్డాయని వాపోయారు కొల్లు ర‌వీంద్ర‌ . ఫలితంగా తమిళనాడు బోట్లు వచ్చి మన మత్స్య సంపదను దోచుకు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన వెంటనే చంద్రబాబు నాయుడు ,నారా లోకేష్ అధికారులను అప్రమత్తం చేసి స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని చెప్పారు.

Exit mobile version