చిత్తూరు జిల్లా : యుఎస్ కమ్యూనికేషన్ ఉప గ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ -2 రాకెట్ ఇస్రో వేదికగా అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకు వెళ్లింది. ఇది అత్యంత బరువైన కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేసే ఉపగ్రహం కావడం విశేషం. ఇండియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రయోగం సక్సెస్ కావడంతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. ప్రపంచంలో అంతరిక్షం పరంగా టాప్ లో కొనసాగుతోంది భారత్. ఇదిలా ఉండగా 24 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే రెండు S200 సాలిడ్ బూస్టర్‌ల మద్దతుతో 43.5 మీటర్ల పొడవైన రాకెట్ ఉదయం 8.55 గంటలకు రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అంతరిక్షంలోకి నేరుగా దూసుకు వెళ్లింది. రాకెట్ లాంచింగ్ కంటే ముందు ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
వాణిజ్య మిషన్ లో భాగంగా దీనిని ప్రయోగించారు. అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2ను ఇక్కడి నుండి ప్రయోగించింది. S200 సాలిడ్ బూస్టర్‌ల మద్దతుతో 43.5 మీటర్ల పొడవైన రాకెట్ చెన్నైకి తూర్పున 135 కి.మీ దూరంలో ఉన్న ఈ స్పేస్‌పోర్ట్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి దూసుకు వెళ్లింది ఉపగ్రహం. రాకెట్‌పై పిగ్గీబ్యాక్‌లో ప్రయాణించే అంతరిక్ష నౌక బ్లూబర్డ్ బ్లాక్-2 విడిపోయి దాదాపు 520 కి.మీ ఎత్తులో ఉన్న దాని ఉద్దేశించిన కక్ష్యకు చేరుకుంటుందని ఇస్రో తెలిపింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) యుఎస్ ఆధారిత ఏఎస్టి స్పేస్ మొబైల్ మధ్య వాణిజ్య ఒప్పందం చోటు చేసుకుంది. 4జి, 5జి వాయిస్, వీడియో కాల్స్, టెక్స్ట్స్ , స్ట్రీమింగ్ , డేటా వినియోగించు కునేందుకు వీలు కుదురుతుంది.

















