ఇషాన్ కిష‌న్ రాక సంజూ శాంస‌న్ కు ప‌రీక్ష‌

న్యూజిలాండ్ తో భార‌త్ 5వ టి20 మ్యాచ్

hellotelugu-SaamsonIshanKishan

కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి రిహార్సిల్ గా భావిస్తున్న న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో కీల‌క‌మైన‌, ఐదో టి20 మ్యాచ్ పై అంద‌రి క‌న్ను ప‌డింది. దీనికి కార‌ణం గ‌త నాలుగు మ్యాచ్ ల‌లో ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అభిషేక్ శ‌ర్మ‌కు జోడీగా ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఇంకా టీం ఇండియా మేనేజ్మెంట్ నానా తంటాలు ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో కేర‌ళ కు చెందిన సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇచ్చినా తాను వినియోగించు కోవ‌డంలో విఫలం చెందాడు. వ‌రుస‌గా త‌ను ఆడిన నాలుగు మ్యాచ్ ల‌లో 10, 6, 0, 24 ర‌న్స్ చేశాడు. ఇక యువ ఆట‌గాళ్లు స‌త్తా చాటుతుండ‌డంతో త‌న‌పై తీవ్ర‌మైన ఒత్తిడి పెరుగుతోంది.

ఇష్టాన్ కిష‌న్ తిరిగి జ‌ట్టులోకి రానున్న‌ట్లు టాక్. మ‌రో వైపు స్వంత గ్రౌండ్ కావ‌డంతో శాంస‌న్ తీవ్ర ఒత్తిడి కొన‌సాగుతోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగో మ్యాచ్ ను పోగొట్టుకుంది. కానీ ఈ ఐదో మ్యాచ్ ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దులు కోకూడ‌ద‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇషాన్ కిష‌న్ తో పాటు అక్ష‌ర్ ప‌టేల్ ను తీసుకోవాల‌ని గంభీర్ చూస్తున్న‌ట్లు టాక్. ఇక సొంత ప్రేక్షకుల ముందు ఆడనున్న సంజు శాంసన్‌కు తన ఫామ్‌ను తిరిగి పొందడానికి ఇది సరైన అవకాశం కానుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 4 మ్యాచ్‌లలో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు . ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్నందున, అతను భారీ స్కోరు చేయాలని ఆశిస్తున్నాడు.

ఇక న్యూజిలాండ్‌తో 5వ టీ20కి భారత తుది జట్టు అంచనా ఇలా ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

Exit mobile version