ఖ‌మేనీ ఖ‌తం అమెరికాపై ఇరాన్ ఆగ్ర‌హం

క‌మాండ‌ర్ హ‌త్య‌కు గురైనట్లు ధ్రువీక‌ర‌ణ

hellotelugu-IranRevolutionaryGurads

ఇరాన్ : ఇజ్రాయెల్, అమెరికా ఏక‌ప‌క్ష దాడుల్లో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏకంగా ఇరు దేశాలు సంయుక్తంగా జ‌రిపిన స్ట్రైక్స్ లో ఇరాన్ సుప్రీం కమాండ‌ర్ ఇన్ చీఫ్ ఆయ‌తుల్లా ఖ‌మేనీ తో పాటు మ‌రికొంద‌రు ఇరాన్ ముఖ్య దేశాధినేత‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని సాక్షాత్తు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించాడు. ఇందుకు సంబంధించి త‌న స్వంత సోష‌ల్ మీడియా ట్రూత్ సోష‌ల్ లో పోస్ట్ చేశాడు. ఇక ఇరాన్ ను ఎవ‌రూ కాపాడ లేర‌ని అన్నారు ట్రంప్. మ‌రో వైపు ఇరాన్ త‌మ దేశాధినేత ఖ‌మేనీ మృతి చెందిన‌ట్లు ధ్రువీక‌రించింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తీకారం తీర్చుకుని తీరుతామ‌ని ఇరాన్ ప్ర‌క‌టిచింది.

ఖమేనీ మరణం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ అత్యంత క్రూరమైన నిరసనకు ప్రతిజ్ఞ చేసింది 1989 నుండి ఇరాన్ అత్యున్నత నాయకుడిగా, పశ్చిమ దేశాల బద్ధ శత్రువుగా పేరు పొందాడు అయతుల్లా అలీ ఖమేనీ. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చివేసేందుకు రెండు శక్తులు ప్రయత్నిస్తున్నందున, ఆదివారం రెండవ రోజు వరకు కొనసాగిన భారీ అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభ దాడిలో చంపబడ్డాడు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరు అని అభివర్ణించింది ఇరాన్. ఖమేనీ హంతకులను శిక్షిస్తామని ఇరాన్ విప్లవ గార్డులు ప్రతిజ్ఞ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల చరిత్రలో అత్యంత భయంకరమైన దాడి ఏ క్షణంలోనైనా ప్రారంభమవుతుంది అని గార్డ్స్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Exit mobile version