ఐపీఎల్ 2026లో మార‌నున్న కెప్టెన్లు

రాజ‌స్తాన్ కు రియాన్ ఢిల్లీకి రాహుల్

hellotelugu-IPL2026Captains

ఐపీఎల్ వేలం పాట ముగియ‌డంతో ఆయా జ‌ట్ల‌కు సంబంధించి కెప్టెన్లుగా ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించాయి ఆయా ఫ్రాంచైజీలు. ఈసారి జ‌రిగిన ఐపీఎల్ టోర్నీలో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలో స‌త్తా చాటింది. ఆ జ‌ట్టు 2వ క్వాలిఫ‌య‌ర్ కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడి పోయింది. ఈసారి కూడా పాండ్యానే కెప్టెన్ గా రానున్నాడు. ఇక ఆర్సీబీ ఈసారి విన్న‌ర్ గా నిలిచింది. ర‌జిత్ పాటిదార్ నే మ‌రోసారి స్కిప్ప‌ర్ గా ఛాన్స్ ఇవ్వ‌నున్నారు. శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీకి ఢోకా లేదు. త‌ను గుజ‌రాత్ టైటాన్స్ కు నాయ‌కుడిగా ఉంటాడు. పంజాబ్ కింగ్స్ సార‌థిగా తిరిగి శ్రేయాస్ అయ్య‌ర్ నే కొన‌సాగించ‌నుంది ఓన‌ర్ ప్రీతి జింథా. హైద‌రాబాద్ జ‌ట్టు కెప్టెన్ గా క‌మిన్స్ కే ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు విష‌యంలో పంత్ కెప్టెన్ గా ఉంటాడా లేక వేరే ఆట‌గాడికి అవ‌కాశం ద‌క్కుతుందా అనేది చూడాలి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విష‌యంలో ఇప్ప‌టికే కెప్టెన్ గా ఉన్న సంజూ శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు వెళ్లాడు. త‌న స్థానంలో రియాన్ ప‌రాగ్ స్కిప్ప‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయ‌కుడిగా ఉంటాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు ర‌హానే కెప్ట‌న్ గా ఉంటాడ‌ని స‌మాచారం. ఈ సీజ‌న్ లో త‌ను అద్భ‌/తంగా ఆడాడు. త‌న‌ను త‌ప్పించే ఛాన్స్ లేదు. చివ‌ర‌గా ఢీల్లీ క్యాపిట‌ల్స్ కు కెప్టెన్ ను మార్చే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో తిరిగి కేఎల్ రాహుల్ ను వ‌రించ‌వ‌చ్చు.

Exit mobile version