సీబీఎన్ బ్రాండ్ తోనే ఇన్వెస్టర్ల రాక

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

hellotellugu-CBNBrand

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అలియాస్ సీబీఎన్ కు ఉన్న పేరుతోనే ఇవాళ ఏపీకి వెల్లువ‌లా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్‌. అప్పుడు ఇన్వెస్టర్లు అడిగిన మాట మేము ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు రావాలి అని. ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న మూడు యూనిక్ పాయింట్ల గురించి వాళ్లకు చెప్పాను. మొదటిది బ్రాండ్ సీబీఎన్. ప్రపంచంలో ఏ కంపెనీ వద్దకు వెళ్లినా మన బ్రాండ్ సీబీఎన్ పేరు చెప్పగానే డోర్స్ ఓపెన్ అవుతాయ‌ని చెప్పారు. సైబరాబాద్ కట్టిన హిస్టరీ మన బ్రాండ్‌కి ఉంది. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి గేర్ మార్చాం అన్నారు. మూడవది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.

చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఆ బుల్లెట్ ట్రైన్ పేరు నమో. అంటే నాయుడు – మోడీ. అందుకే మనకి గూగుల్ వచ్చింది. దేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తే ఒక్క ఏపీకి 25 రూపాయల పెట్టుబడి వచ్చింది. అదీ సీబీఎన్ బ్రాండ్ సత్తా అని ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన ప్రతి కంపెనీ వెనుక ఒక కథ ఉంది. తీసుకొచ్చిన ప్రతి కంపెనీ వెనుక కష్టం ఉంది. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టు వచ్చింది. గూగుల్ స్టోరీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే గూగుల్ ప్రతినిధులతో ఇదే విశాఖపట్నంలో మొదటి మీటింగ్ జరిగింది అని తెలిపారు నారా లోకేష్‌. ఆరోజు జరిగిన మీటింగ్ ఫలితం ఈ రోజు ఒక డేటా సిటీ. ఆ రోజు వాళ్లు ఒక క్లియర్ విజన్‌తో వచ్చారు. మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. ఆరోజు వాళ్లు అడిగిన మూడు అంశాలను మనం ఒక మిషన్ మోడ్‌లో తీసుకున్నాం. 13 నెలలు పరుగులు పెట్టాం. వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ప్రతి రోజు ఫాలో అప్ చేశాం అన్నారు.

Exit mobile version