The Hunt Sensational Thriller Movie : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ది హంట్

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య

Hello Telugu - The Hunt Sensational Thriller Movie

Hello Telugu - The Hunt Sensational Thriller Movie

The Hunt : మాజీ ప్ర‌ధాని, దివంగ‌త రాజీవ్ గాంధీ హ‌త్య‌పై సీబీఐ 90 రోజుల ద‌ర్యాప్తును ట్రాక్ చేసే ఉత్కంఠ భ‌రిత‌మైన క్రైమ్ డ్రామాగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. దీనిని ది హంట్ (The Hunt) పేరుతో ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఇది సీజ‌న్ -1. మే 1991లో త‌మిళ‌నాడులోని శ్రీ పెరంబుదూర్ లో ఆత్మాహుతి దాడి జ‌రిగింది. దీని వెనుక ఎల్టీటీటీఈ సంస్థ ఉంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. భార‌తీయ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అత్యంత విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌గా దీనిని పేర్కొన‌వ‌చ్చు. ఇందులో కీల‌క వ్య‌క్తుల‌కు జీవిత ఖైదు కూడా విధించింది కోర్టు. త‌మిళ‌నాట డీఎంకే స‌ర్కార్ కొలువు తీర‌డంతో స్టాలిన్ చేసిన ప్ర‌య‌త్నం మేర‌కు రాహుల్ గాంధీ ఫ్యామిలీ వారి విడుద‌ల‌కు ఓకే చెప్పారు. ఇది ప‌క్క‌న పెడితే ది హంట్ – రాజీవ్ హ‌త్య కేసు ఎలా చేశార‌నే దానిపై ఉత్కంఠ భ‌రితంగా చిత్రీక‌రించారు డైరెక్ట‌ర్.

The Hunt Thriller Movie Updates

ఈ సీరీస్ లో పేరు పొందిన స్టార్లు లేరు. ఎలాంటి జిమ్మిక్కులు లేకుండా నిజ‌మైన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఉత్కంఠ భ‌రితంగా థ్రిల్ల‌ర్ గా ఉండేలా చూడ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. తొలి ఫ్రేమ్ నుండి క‌ట్టి ప‌డేసేలా చేశాడు డైరెక్ట‌ర్. ఈ కేసు ఎలా జ‌రిగింద‌నే దానిపై ఆలోచించేలా చేసింది. రాజీవ్ ఆత్మాహుతి దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసును ఐజీపీ డి.ఆర్. కార్తికేయ‌న్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ పాత్ర‌ను అమిత్ సియ‌ల్ పోషించారు. క‌ష్టం సాధ్య‌మే..కానీ అసాధ్యం కానే కాదంటూ పేర్కొన్న సంభాష‌ణ‌లు మ‌రింత ఆక‌ట్టుకునేలా చేస్తాయి. ది హంట్ రాజీవ్ అసాసినేష‌న్ కు సంబంధించిన వెబ్ సీరీస్ కు న‌గేష్ కుమార్, రోహిత్ బ‌నావాలిక‌ర్, శ్రీ‌రామ్ రాజ‌న్ లు కీల‌క పాత్ర పోషించారు.

Also Read : Popular Producer-Allu Aravind : బ్యాంక్ స్కామ్ తో నాకేం సంబంధం – అల్లు అర‌వింద్

Exit mobile version