పంట రుణాలపై వడ్డీ రాయితీ : అచ్చెన్నాయుడు

40.61 ల‌క్ష‌ల మంది ర‌తైఉల‌కు రూ. 685.46 కోట్లు

hellotelugu-APGovt

అమ‌రావ‌తి : తెదేపా హయాంలో ఒక లక్ష లోపు పంట రుణాలకు సున్నా వడ్డీ, ఒకటి నుంచి మూడు లక్షల వరకు పావలా వడ్డీ విధానం అమలు చేసి, వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు చెల్లించిందని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ విధానంతో 40.61 లక్షల మంది రైతులకు రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీ అందిందన్నారు. గత ప్రభుత్వం కాలంలో ఒక లక్ష లోపు రుణాలకు మాత్రమే వడ్డీ లేని విధానం అమలు చేసి, రైతులు ముందుగా అసలు, వడ్డీ చెల్లించిన తర్వాతే తిరిగి వడ్డీ ఇచ్చే విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఖరీఫ్–2022 సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన రూ.131.68 కోట్ల బకాయిలు 6.30 లక్షల రైతులకు విడుదల కాలేదని విమర్శించారు.

ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకానికి రూ.250 కోట్లు కేటాయించి రైతులకు మద్దతుగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ప్రభుత్వం అండగా నిలవాలని లక్ష్యంగా తీసుకుని ఇన్‌పుట్ సబ్సిడీని గణనీయంగా పెంచామని తెలిపారు. వ్యవసాయ శాఖలో వరి పంటకు నష్టపరిహారాన్ని రూ.17,000 నుండి రూ.25,000కు పెంచినట్లు వెల్లడించారు. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు పంట నష్టపోయిన 2 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించామని చెప్పారు. గత ప్రభుత్వం కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న రూ.5.67 కోట్ల నష్టపరిహారాన్ని కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

Exit mobile version